అదీ అమ్మ ప్రేమంటే.. కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం.. వీడియో వైరల్

-

ఈ లోకలంలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. స్వార్థం లేని మనిషి అమ్మ. తన కన్నపిల్లల కోసం అనుక్షణం ఆరాట పడే వ్యక్తి మాతృమూర్తి. తన ఆనందాన్ని, సమయాన్ని, కోరికలను అన్నింటిని పిల్లల కోసం త్యాగం చేస్తుంది. అవసరం అనిపిస్తే.. తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడదు. ఇదే విషయం మరో మారు రుజువైంది. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన చూస్తే తల్లిప్రేమకు నీరాజనం పట్టే మరోకథ మనకు తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

తమిళనాడులోని సేలం కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పాపాతి (45).. 15 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తన పిల్లల కోసం కష్టపడి వారిని చదివిస్తోంది. అయితే తన కుమారుడిని ఎలాగైనా బాగా చదివించాలనుకుంది. కానీ తన ఆర్థిక స్తోమత అందుకు సహకరించకపోయేసరికి.. తను బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ఎవరో పాపాతికి చెప్పారు. తను చనిపోతే ఆ డబ్బుతో తన కుమారుడు చదువుకోవచ్చని భావించిన ఆ తల్లి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. అనుకున్నదే తడవుగా బస్సుకు ఎదురెళ్లి ప్రాణాలు బలిచేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news