రేపే లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం.. మొదట మోదీ.. చివరన శతాబ్దిరాయ్‌

-

నూతన లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణంతో ఈ సమావేశాలు మొదలవుతాయి. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి తర్వాత ప్రధాన ప్రతిపక్షనేత (కాంగ్రెస్‌ గానీ ఆ పేరు ప్రకటిస్తే), ఆ తర్వాత ప్యానల్‌ స్పీకర్లు ప్రమాణం చేస్తారు.

కేబినెట్‌ మంత్రుల ప్రమాణం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్‌సభ సభ్యులు ప్రమాణ స్వీకారంచేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణుపద రే తొలుత ప్రమాణం చేయనుండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్‌తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్టచివరన పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ (బీర్‌భూమ్‌) శతాబ్దిరాయ్‌తో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news