ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తగ్గాలంటే వ్యాక్సిన్ వాడాలి, మందుబిళ్లలు వేసుకోవాలి కానీ దీనికి ఇప్పటి వరకు విరుగుడు కనుగొనలేదన్న విషయం తెలిసిందే.. అయితే ఏం చేయాలంటే ఈ వైరస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అంతే కాని బాబాల దగ్గరికి వెళ్లితే వ్యాధిలేని వారికి కూడా ఈ వైరస్ రావడమే కాదు.. యమలోకంలో కూడా బెర్త్ కన్‌ఫాం అవుతుంది.. ఇదిగో ఇలాగే ప్రవర్తించిన ఒక బాబా బ్రతుకు కూడా కరోనాకు బలైంది.. ఇదంతా మూఢనమ్మకం వల్ల జరిగిన దారుణం..
అదేంటో చూస్తే.. మధ్యప్రదేశ్‌లోని రత్నాలం జిల్లాలో మొత్తం 85 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా.. వీరిలో ఒక్కరి వల్లే 19 మందికి కోవిడ్-19 సోకినట్టు అధికారులు గుర్తించారట.. ఇదేలా సాధ్యమని విచారణ చేస్తే నయాపుర ప్రాంతానికి చెందిన అస్లామ్ బాబా అనే అతను తాను కరోనా బాధితుల చేతులను ముద్దాడితే వైరస్ తగ్గిపోతుందంటూ ప్రచారం చేసుకున్నాడట.. ఇంకేముంది డిస్కంట్ సేల్స్‌కు వెళ్లినట్లుగా ఇతని దగ్గరకు దాదాపు 85 మంది వచ్చి ఆయనతో తమ చేతులకు ముద్దుపెట్టించుకున్నారు. కాగా ఈ నెల 4వ తేదీన ఈ ముద్దుల బాబా కరోనా వచ్చి శ్మశానానికి పోయాడట..
దీంతో అప్రమత్తమైన అధికారులు బాబాను కాంటాక్ట్ అయినవారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించగా వీరిలో ఆరుగురికి జూన్ 7 కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందట. తాజాగా వారిలో మరో 12 మందికి వైరస్ సోకిందని తెలిసింది.. ఇకపోతే కరోనా గురించి ప్రజలకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా స్థానికులు మాత్రం ఈ వైరస్‌కు చికిత్స కోసం అస్లామ్ బాబాను ఆశ్రయించడం గమనార్హం. ఇలాంటి వారిని ఏమనాలో మీరే నిర్ణయించుకోండి..