పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పదంగా మృతి చెందారు. పాలస్తీనా రమల్లా నగరంలో ఉన్న భారత రాయబారి కార్యాలయంలో ముకుల్ ఆర్య మృతి చెందారు. ముకుల్ మరణంపై పాలస్తీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముకుల్ ఆర్య మరణాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ధ్రువీకరించారు. ఆయన మరణంపై జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే.. పాలస్తీనా అలెర్ట్ అయింది. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, ప్రధాని మహ్మద్ స్టాయి భద్రతా, పోలీస్, ఫోరెన్సిక్ అధికారులు అలెర్ట్ చేశారు. వెంటనే భారత రాయబారి కార్యాలయానికి చేరుకుని.. విచారణ చేపట్టాలని ఆదేశించింది. మృత దేహాన్ని భారత్ తరలించేందు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి విదేశాంగ శాఖ తెలిపింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ 2008 బ్యాచ్ కు చెందిన ముకుల్ ఆర్య కాబుల్, మాస్కోల్లో పనిచేశారు. ఢిల్లీలో జవరహర్ లాల్ యునివర్సీటీలో ఆర్థిక శాస్త్రంలో విద్యను అభ్యసించారు. పారిస్ లోని యూనెస్కోకు భారత శాశ్వత టీంలో కూడా ఆయన పనిచేశారు.
పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి.
-