మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు 700 మంది

-

ఓవైపు మణిపుర్​లో అల్లర్లు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంటే.. మరోవైపు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది అక్కడి సర్కార్​కు. అదేంటంటే..? సుమారు 700 మందికి పైగా మయన్మార్‌ వాసులు మణిపుర్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈ అంశం మణిపుర్​ సర్కార్​ను ఆందోళనకు గురి చేస్తోంది.

అస్సాం రైఫిల్స్ సెక్టార్‌ 28 అందించిన సమాచారం ప్రకారం 718 మంది మయన్మార్‌ వాసులు జులై 23-24 తేదీల్లో మణిపుర్‌లోని చందేల్‌ జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నారు. వీరంతా సరైన ప్రయాణ పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించారని అస్సాం రైఫిల్స్ సెక్టార్‌ వెల్లడించింది.

సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన వారిని వెనక్కి పంపేయాలని అస్సాం రైఫిల్స్‌కు సూచించామని మణిపుర్‌ చీఫ్‌ సెక్రటరీ డా. వినీత్‌ జోషి తెలిపారు. వీసా, అధీకృత ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి ఎవరిని మణిపుర్‌లో అనుమతించవద్దని కేంద్ర హోం శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news