జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయచట్టాలు

-

జులై1వ తేదీ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త చట్టాల (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌)తో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది.

కీలక మార్పుల్లో కొన్ని ఇవే..

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయొచ్చు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పోలీసుస్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు.

అరెస్టు సందర్భాల్లో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది.

అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు.

హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్‌ నిపుణులు తప్పనిసరి. వారు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి.

మహిళలు, చిన్నారులపై జరిగే ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.

మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళాసిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాలి.

Read more RELATED
Recommended to you

Latest news