పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్‌ 1 నుంచి 5 కొత్త రూల్స్‌..!

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల జరిగిన బడ్జెట్‌ 2021 సమావేశంలో ఆదాయపు పన్నుకు సంబంధించి పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. ఈ నియమం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అందులో మారే అంశాలు పన్ను చెల్లింపుదారులు కచ్ఛితంగా తెలుసుకోవాలి.

tax
tax

1.పీఎఫ్‌ ట్యాక్స్‌ రూల్స్‌:
ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌లో కూడా ఆర్థికమంత్రి మార్పులు చేశారు. ఇది ఎంప్లాయీస్‌కి షాకింగ్‌ విషయమే. ఒక ఏడాదిలో పీఎఫ్‌ అకౌంట్లకు కంట్రిబ్యూట్‌ చేసే మొత్తం రూ.2.5 లక్షలు మించి ఉంటే దానిపై పన్ను విధించడం జరుగుతుంది. రూ.2.5 లక్షలు దాటిన మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను భారం పడుతుంది.

2.టీడీఎస్
ఐటీఆర్‌ ఫైలింగ్‌ను ప్రోత్సహించడానికి ఆదాయపు పన్నుకు సంబంధించిన సెక్షన్‌ 206 ఏబీ, సెక్షన్‌ 206 సీసీఏ టీడీఎస్‌ నియమాలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయని వారు రెట్టింపు టీడీఎస్‌ చెల్లించుకోవలసి వస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ రూల్‌ వర్తిస్తుంది.

3.ఎల్‌టీటీ క్యాష్‌ వోచర్
మోదీ సర్కార్‌ బడ్జెట్‌లో ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌కు సంబంధించి కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌పై కూడా ఏప్రిల్‌ 1 తర్వాత పన్ను ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

4.ఐటీఐఆర్
అంతేకాకుండా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటీఆర్‌ ఫామ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రిఫిల్డ్‌ ఐటీఆర్‌లు తీసుకువస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీంతో ఐటీఆర్‌ దాఖలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

5.ఎల్‌టీసీ పథకం
లీవ్ ట్రావెల్ కన్సెషన్‌కు (ఎల్‌టీసీ) వ్యతిరేకంగా నగదు భత్యానికి ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టీసీ పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోతున్న వ్యక్తులను అనుమతించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వ్యయాన్ని పెంచడానికి ఈ ప్రత్యేక పథకాన్ని 2020లో ప్రభుత్వం ప్రకటించింది.

పాన్-ఆధార్‌కు లింక్ తప్పనిసరి..
కరోనా విజృంభణ నేపథ్యంలో 2020 జూన్ 30 నుంచి 2021 మార్చి 31 వరకు ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 31వ తేదీన పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు పని చేయదని, ఆర్థిక లావాదేవీలు జరగాలంటే తప్పనిసరిగా పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయాలన్నారు. ఒకవేళ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు జరగవని హెచ్చరిస్తున్నారు.

డబుల్ టాక్సేషన్ నివారించడానికి..
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్నుపై రెట్టింపు పన్నును చెల్లిస్తున్న విదేశీ పౌరులు, ప్రవాస భారతీయులు తమ వివరాలను వెల్లడించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) కోరింది. ఈ మేరకు జారీ చేసిన నివేదిక ప్రకారం.. డీటీఏఏలు అందించే ఉపశమనాన్ని పరిగణలోకి తీసుకుని కూడా వారు డబుల్ పన్నులు కడుతున్న వారు తమ వివరాలను ఫారం ఎన్ఆర్‌లో సమర్పించాలని సీబీడీటీ అధికారులు కోరుతున్నారు.

ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం కింద బిల్లు సమర్పణ..
ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం కింద పన్ను ప్రయోజనాన్ని పొందడానికి మార్చి 31వ తేదీ కంటే ముందు జీఎస్‌టీ బిల్లులు పూర్తిగా క్లియర్ చేసుకోండి. ఈ పథకం ద్వారా ఒక ఉద్యోగి ఎల్‌టీఏ ఛార్జీలు పొందాలనుకుంటే మూడు రెట్లు (12 శాతం) జీఎస్‌టీ చెల్లించి ఉండాలి.

ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను (ఐటీఆర్) దాఖలు చేయని వారిపై అధిక రుసుము చెల్లించడం జరుగుతుంది. ఈ నెల 31వ తేదీ వరకు ఆదాయపు పన్ను చెల్లించని వారిపై రూ.10 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. రూ.5 లక్షల ఆదాయంలోపు సంపాదించేవారిపై రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అందుకే ఈ నెల 31వ తేదీ లోపు ఐటీఆర్ దాఖలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు
2020-21 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లింపు చివరి తేదీ మార్చి 15, 2021. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పన్ను టీడీఎస్ కంటే తక్కువ రూ.10 వేలు, 100 శాతానికి మించి పన్ను ఉంటే మీరు ముందుగానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడుపు తప్పిపోతే జరిమానా వడ్డీ విధించడం జరుగుతుంది. గడువు ముగియక ముందే పన్ను చెల్లించేలా చూసుకోండి.