సీఎంలతో మోదీ కీలక సమావేశం…మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారా ?

Join Our Community
follow manalokam on social media

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరుగుతుంది. దేశంలో కోవిడ్ -19 పరిస్థితి మీద ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా టీకా డ్రైవ్‌ ను కూడా పీఎం మోడీ సమీక్షిస్తారని అంటున్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. ఇక అనేక రాష్ట్రాల్లో COVID-19 కేసుల పెరుగుదల గురించి ప్రధానితో ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. జనవరి 16న ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా డ్రైవ్‌ ప్రారంభించిన తర్వాత మొదటిసారి మోడీ సీఎంలతో సమావేశం జరుగుతుంది.

ఈ వర్చువల్ సమావేశం యొక్క ప్రాధమిక ఎజెండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కరోనా కేసుల పెరుగుదల. గత ఆరు రోజులుగా, భారతదేశంల్లో రోజుకు 20,000 కి పైగా COVID-19 కేసులు నమోదవుతున్నాయి. ఇక రోజువారీ కేసులు డిసెంబర్ 19 నుంచి మొదటిసారిగా 26,000 మార్కును దాటడంతో కొత్త టెన్షన్ నెలకొంది. COVID-19 కేసులలో మహారాష్ట్ర అత్యధికంగా నిలిచింది, తర్వాత పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మరియు హర్యానా కేసులు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్న కారణంగా చాలా చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇక దీంతో భారత్ లో లాక్ డౌన్ విధిస్తారు అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. చూడాలి ఏమి జరగనుంది అనేది. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...