న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్ట్‌

-

న్యూస్​క్లిక్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మనీలాండరింగ్‌తోపాటు చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఆ కంపెనీ జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉపా చట్టం కింద న్యూస్​ క్లిక్​ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ సహా ఇద్దరు వ్యక్తులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 37 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, అమిత్‌ చక్రవర్తికి ఈ కేసుతో సంబంధం ఏమిటనే వివరాలు మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న 30చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. న్యూస్‌క్లిక్‌ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్‌ టైమ్స్‌లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. న్యూస్​క్లిక్​ ఎడిటర్​ ఇన్ చీఫ్​తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్​ సెల్​ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news