బంగాల్ లో టెన్షన్.. ఎన్ఐఏ వాహనంపై రాళ్లదాడి

-

పశ్చిమ బెంగాల్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వాహనంపై దాడి కలకలం రేపింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్​ఐఏ అధికారుల వాహనాన్ని స్థానికులు చట్టుముట్టి రాళ్లతో దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్​కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ జిల్లాలోని భూపతినగర్​ ప్రాంతంలో ఇవాళ ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో తమ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్​ఐఏ తెలిపినట్లు ఓ సీనియర్​ పోలీసు ఆఫీసర్​ వెల్లడించారు. దీనిపై ఎన్​ఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. అరెస్టు చేసిన వ్యక్తులతో, ఎన్​ఐఏ అధికారులు ఉన్న భూపతినగర్​కు భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. 2022 డిసెంబర్ 3వ తేదీన భూపతినగర్​లో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఈ కేసు దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించారు. మరోవైపు, రేషన్​ కుంభకోణానికి సంబంధించి జనవరిలో ఉత్తర 24పరగణాల జిల్లాలోని సందేశ్​ఖాలీ ప్రాంతంలో దర్యాప్తు కోసం వెళ్లిన ఈడీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version