విద్యార్థులకు కేంద్రం శుభవార్త..విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తామని కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అనంతరం మాట్లాడుతూ.. ఏపీ, బీహార్ కు కూడా పూర్వోదయ పథకం అమలు వర్తింప జేస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈశాన్య రాష్ట్రాలకు వర్తించే పూర్వోదయ పథకాన్ని ఏపీ, బీహార్ కు కూడా వర్తింపజేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అటు పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్త చెప్పింది.
పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తామని వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు.
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు
కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను