మోదీ 3.0 సర్కారులో తొలి వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వరసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనత సాధించి హిస్టరీ రికార్డు చేయబోతున్నారు. బీజేపీకి లోక్‌సభ స్థానాలు తగ్గడం, త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్‌లో భారీగా జనాకర్షకాలు ఉండచ్చన్న అంచనాలున్నాయి.
ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు, బీమా మొత్తం పెంపు, ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక, సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న కళ సాకారం కోసం కార్యాచరణ ప్రణాళికను బడ్జెట్‌లో ఆవిష్కరించనున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో 2024-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెట్టిన కేంద్రం మౌలిక వసతులకు సముచిత ప్రాధాన్యమిచ్చింది. పూర్తిస్థాయి బడ్జెట్‌లోనూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం ఖాయమని సమాచారం. ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్ణయాలు ప్రకటించొచ్చు. 10 లక్షల్లోపు ఆదాయం గల వారికి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి.