నివార్‌.. పెను తుఫాన్

-

రంగ‌లోకి ఎన్టీఆర్ ఎఫ్‌

- Advertisement -

నివార్ తుఫాను పెను తుఫాన్‌గా మారింది. ఆగ్నేయ‌ తీరం వైపు దూసుకుపోతున్న‌ది. దీంతో బుధవారం ఉదయం తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా తుఫాను దెబ్బతినవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. కృష్ణపట్నం పోర్ట్ లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లా కి భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నెల్లూరు కర్నూలు చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్న‌ది.

స‌హాయ‌క చ‌ర్య‌లు అందించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో 30 బృందాలను మోహరించింది. మ‌రో 20 అదనపు బృందాలను స్టాండ్‌బైలో ఉంచింది. మత్స్యకారులు సముద్రంలోకి చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని సూచించ‌డంతోపాటు తీరప్రాంతాల ప్రజలను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పుదుచ్చేరి గవర్నమెంట్ అయితే ఏకంగా 144 సెక్షన్ విధించింది. దక్షిణాది ప్రాంతానికి, ప్రధానంగా చెన్నైకి ఇండిగో విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. మొత్తం 49 విమాన స‌ర్వీస్‌ల‌ను రద్దు చేసిన‌ట్లు ఇండిగో ప్ర‌క‌టించింది. నవంబర్ 26న ప‌రిస్థితిని అంచనా వేసి తదుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్న‌ది. దక్షిణ రైల్వే కొన్ని రైలు సర్వీసులను రద్దు చేసింది రైల్యేశాఖ‌. దీంతోపాటు తమిళనాడులోని ఏడు జిల్లాల్లో ప్రైవేట్ బస్సులతో సహా ఇంటర్ మరియు ఇంట్రా బస్సు సర్వీసులను నిలిపివేసింది. చెన్నైలో మంగళవారం జరగాల్సిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మెడికల్ కౌన్సెలింగ్ నవంబర్ 30 కి ప్ర‌భుత్వం వాయిదా వేసింది. నివార్ తుఫాన్ బుధవారం తెల్లవారుజామున శ్రీలంక యొక్క ఉత్తరాన ఉన్న కంకేశాంతురై తీర పట్టణానికి ఈశాన్యంగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తిరుమ‌ల‌లో భ‌క్తుల ఇబ్బందులు
నివర్ తుఫాను ప్రభావం తిరుమలపై త‌డిసిముద్ద‌వుతున్న‌ది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుం​డా వర్షం కురుస్తుంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు తడిసిపోతున్నారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమ‌య్యాయి. మరోపక్క ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...