కర్ణాటక సీఎం ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు – సూర్జేవాలా

-

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు.. ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ల మధ్య ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపై పార్టీ అధిష్టానం ఓ స్పష్టతకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఇద్దరు అగ్ర నేతలు ముఖ్యమంత్రి కుర్చీని చెరో రెండున్నర ఏళ్ళు పంచుకోనున్నారని.. మొదటి రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి డీకే తో మాట్లాడి బుజ్జగించారని వార్తలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంపికపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్న దానిపై ఇంకా చర్చలకు కొనసాగుతున్నాయని.. రేపటి లోగా తుది నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మీడియాలో వస్తున్నట్లు సీఎం ప్రమాణ స్వీకారం తేదీ కూడా తప్పేనని సూర్జేవాలా చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news