సీఎం కేసీఆర్ పై మరోసారి తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరిగినట్లు.. కేసీఆర్ కు అధికారమిస్తే తెలంగాణ మొత్తాన్ని అమ్మకానికి పెడుతుండు అని విమర్శించారు. నాటి దొరలు బలవంతంగా భూములు దోచుకుంటే.. నేటి దొర జీవోలతో భూములు అమ్మేసి, వేల కోట్లు వెనకేస్తుండని దుయ్యబట్టారు. రైతులకిచ్చిన అసైన్డ్ భూములను, పరిశ్రమలకిచ్చిన భూములను సైతం వదలడం లేదని మండిపడ్డారు షర్మిల.
ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే భావితరాన్ని హత్య చేయడమేనన్నారు. భవిష్యత్తు అవసరాలకు భూములే లేకుండా కొల్లగొడుతుండు సారు. ఇదేనా మీరు చెప్పే సంపద సృష్టి? ఇదేనా ధనిక రాష్ట్రం? 2014లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములెన్ని? ఇప్పుడున్న భూములెన్నో దమ్ముంటే కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.