భోపాల్​లో విపక్ష కూటమి నాలుగో సమావేశం.. ఎప్పుడంటే..?

-

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్​ను ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో ఉంది విపక్ష కూటమి ఇండియా. ఈ క్రమంలోనే వరుస భేటీలతో వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ముంబయిలో మూడోసారి సమావేశమైన ఈ కూటమి త్వరలో నాలుగోసారి భేటీ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. నాలుగో దఫా భేటీకి మధ్యప్రదేశ్​లోని భోపాల్ వేదిక కానున్నట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. భోపాల్​లో మీటింగ్​తో పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపాయి.

తర్వాతి దశ సమావేశం గురించి ముంబయి మీటింగ్​లోనే చర్చలు జరిగాయని ఆయా వర్గాలు వివరించాయి. వివిధ పార్టీలన్నీ భోపాల్​లో సమావేశానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి. ఇందుకు సంబంధించి తేదీలు ఇంకా ఖరారు చేయలేదని వివరించాయి. అక్టోబర్​లో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సమావేశాల్లో చర్చించిన అంశాలు, ఇతర అజెండాలపైనా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. మీటింగ్ నిర్వహణకు దిల్లీ పేరును సైతం పరిశీలించినట్లు కూటమి వర్గాలు చెప్పాయి. అయితే, చివరకు భోపాల్​వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news