భారత్‌కు పెనుశాపంగా నోటి క్యాన్సర్‌

-

భారత్ కు పెను శాపంగా నోటి క్యాన్సర్ మారింది. నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18% అని.. నోటి క్యాన్సర్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించింది.

2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్‌ చికిత్స పొందిన 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేయగా.. 91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 ఏళ్ల వయసు వారిలోనే సంభవించాయని టీఎంసీ తేల్చింది. 70% ప్రారంభ దశ, 86% ముదిరిన దశ క్యాన్సర్లు మధ్య తరగతి కుటుంబాల వారిలోనే బయటపడ్డాయని తెలిపింది. అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారని పేర్కొంది. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులైతే రూ.57,22,803, స్త్రీలైతే రూ.71,83,917లుగా గణించారు.

Read more RELATED
Recommended to you

Latest news