జమ్ముకశ్మీర్ డీజీపీ హత్య అమిత్ షాకు వెల్ కమ్ గిఫ్ట్.. పీఏఎఫ్​ఎఫ్ ప్రకటన

-

జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు.  సోమవారం రాత్రి డీజీని జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్​వాలాలోని ఆయన ఇంట్లోనే ఎవరో గొంతు కోసి, హత్య చేశారు. ఆ గదిలోనే డీజీ మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అనంతరం హేమంత్ ఇంటి పని మనిషి జసీర్ కనిపించకుండా పోగా.. అతడే ప్రధాన అనుమానితుడని పోలీసులు భావించారు.

కానీ ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య కేసులో ఇంటి పని మనిషి జసీర్​పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ హత్య తమ పనేనని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్​-పీఏఎఫ్​ఎఫ్​ అనే సంస్థ ప్రకటించుకుంది.

“ప్రత్యేకంగా నిఘా పెట్టి మా స్పెషల్ స్క్వాడ్​ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఇలాంటి హైప్రొఫైల్ ఆపరేషన్లకు ఇది ప్రారంభం మాత్రమే. మేము తలచుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా కచ్చితత్వంతో దాడి చేయగలమని హిందుత్వ పాలకులను, వారి భాగస్వాములను హెచ్చరించేందుకే ఇదంతా. కట్టుదిట్టమైన భద్రత మధ్య కశ్మీర్​ పర్యటనకు వస్తున్న హోం మంత్రికి ఇదొక చిరు కానుక. మున్ముందు ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని చేపడతాం” అని ఆ ప్రకటనలో పేర్కొంది పీఏఎఫ్​ఎఫ్​.

Read more RELATED
Recommended to you

Latest news