భారత్ చేరుకున్న పాక్ మంత్రి బిలావల్ భుట్టో.. సలామ్ ఇండియా అంటూ..

-

‘గోవా నుంచి భారత్ కు సలామ్’.. భారత్ లో అడుగుపెట్టిన తొలి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మాటలు ఇవి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశం‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవా చేరుకున్నారు. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొననున్నారు. 2011 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా బిలావల్ నిలిచారు.

సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం సహా అనే అంశాల్లో పాక్పై భారత్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో భుట్టో భారత్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైంకర్, భుట్టో మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు లేవని తెలుస్తోంది. పాక్ నుంచి కూడా ఎలాంటి అభ్యర్థనలు రాలేవని సమాచారం.

“షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పాల్గొనడం కోసం గోవాకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. ఎస్సీఓలో పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి నేను నాయకత్వం వహిస్తున్నాను. ఎస్సీఓ చార్టర్ పట్ల పాకిస్థాన్కు ఉన్న బలమైన నిబద్ధత వల్లే ఈ సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీఓ విదేశాంగ మంత్రుల మండలి (సీఎఫ్ఎమ్) విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను. ఈ సమిట్లో నా సహచర విదేశాంగ మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తాను.”

-బిలావల్ భుట్టో జార్దారీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news