బిహార్ ముఖ్యమంత్రికి షాక్.. కుల గణనపై హైకోర్టు స్టే

-

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పట్నా హై కోర్టు షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న కుల గణన, ఆర్థిక సర్వేపై పట్నా హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనను తక్షణమే నిలిపివేయాలని.. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా ఉంచాలని.. ఎవ్వరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేవీ చంద్రన్, జస్టిస్ మధురేశ్ ప్రసాద్ తో కూడిన డివిజన్ బెంచ్.. గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జులై 3 వరకు అమలులో ఉండనున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణను జులై 7కు కోర్టు వాయిదా వేసింది.

“ఈ సర్వేలో సేకరించిన సమాచారం సమగ్రత, భద్రతకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కుల ఆధారిత సర్వేను నిర్వహించే అధికారం లేదని మేము అభిప్రాయపడుతున్నాము. ఇది జనాభా లెక్కల లానే ఉంది. యూనియన్ పార్లమెంట్ శాసనాధికారంపై ఇది ప్రభావం చూపుతుంది” అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news