అయోధ్య రామమందిరం పై పాకిస్తాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్..!

-

కర్ణాటకలోని గడగ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ సృష్టించి షేర్ చేయడంతో గజేంద్రగడ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్టు ఫొటోలను మార్పింగ్ చేయడంతో పవిత్ర ఆలయ ప్రారంభోత్సవం రోజునే లక్షలాది మంది హిందువుల మనోభావాలకు భంగం కలిగేవిధంగా చేసినందుకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ దేశానికి చెందిన జెండాను మార్పింగ్ చేసిన ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో హిందూ అనుకూల సంస్థలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హిందూ సమాజం ఆగ్రహానికి దారి తీసింది. అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకున్నారు. గడగ్ జిల్లా పోలీసులు వెంటనే తాజుద్దీన్ దఫేదార్ ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల నుంచి అయోధ్య పై పాకిస్తాన్ జెండా ఉన్న అభ్యంతరకరమైన పోస్ట్ ను తొలగించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేవిధంగా చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news