సెప్టెంబ‌ర్ 15నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

-

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వ‌హించాల‌ని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి సెలవులు, వారాంతపు విరామం లేకుండా మొత్తం 18 సిట్టింగ్‌లుండే ఈ సమావేశాల తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భౌతిక దూరం నిబంధనల మేరకు లోక్‌సభ, రాజ్యసభ చాంబర్లతోపాటు గ్యాలరీలను కూడా సిద్ధం చేస్తున్నారు.

రాజ్యసభకు చెందిన 60 మంది సభ్యులు చాంబర్‌లోనూ, 51 మంది గ్యాలరీల్లోనూ, మిగతా 152 మంది లోక్‌సభ చాంబర్‌లోనూ ఆసీనులవుతారు. భారత పార్లమెంట్‌ చరిత్రలో 1952 తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. లోక్‌సభ సెక్రటేరియట్‌ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. కాగా, ప్రస్తుతం కొవిడ్‌–19 కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఉభయసభలను ఉదయం, సాయంత్రం షిఫ్టుల వారీగా నిర్వహిస్తారు. చివరిసారిగా పార్లమెంట్‌ సమావేశాలు మార్చి 23వ తేదీన కోవిడ్‌ కారణంగా వాయిదాపడిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news