టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో తన బ్యాట్లకు మరమ్మతులు చేసిన అష్రాఫ్ చౌదరి అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యాడని తెలిసి చలించిపోయారు. ఈ క్రమంలో సవ్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అష్రాఫ్‌ను ఆయన పరామర్శించారు. అంతేకాదు అతడికి భారీ మొత్తంలో ఆర్థికసాయం కూడా అందించారు. ఈ విషయాన్ని అష్రాఫ్ సన్నిహితుడు ప్రశాంత్ జెఠ్మలాని వెల్లడించారు.
కాగా, ఇంతకుముందే అష్రాఫ్ విషయంపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించిన విషయం తెలిసిందే. ఇకపోతే అష్రాఫ్.. సచిన్, విరాట్ కోహ్లీ వంటి భారత క్రికెటర్లకే కాదు, స్టీవ్ స్మిత్, క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా బ్యాట్ రిపేర్లు చేసేవాడు. అలాగే అష్రఫ్ బ్రోస్ అనే బ్యాట్ల కంపెనీని కూడా ఆయన నడిపిస్తున్నాడు. విండీస్ బోర్డు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ జట్టుకు 16 బ్యాట్లు ఉచితంగా అందజేశాడు.