PM kishan: రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్..ఆ రోజునే డబ్బులు జమ !

-

PM Kisan 17th Instalment: రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత ఫైల్‌పై మోదీ సంతకం పెట్టారు. దీంతో దేశంలోని 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున దాదాపు రూ.20వేల కోట్ల జమకానున్నాయి.

PM Kisan 17th Instalment Released to 9 Crore Beneficiaries Check Status Online

కాగా, సౌత్‌ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రైతుల ప్రగతికి, భారతదేశ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. రైతుల కోసం ఈ టర్మ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news