ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. యధావిధిగా విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని అలాగే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుకను… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన తరహాలోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కొత్త ప్రభుత్వం.
ప్రభుత్వం మారినందున విద్య కానుకను ఏం చేస్తారనే సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈనెల 13వ తేదీన బడులు తెచ్చుకునే రోజు నుంచి పంపిణీ మొదలు పెట్టనుంది. 2024 సంవత్సరం నుంచి 2025 విద్యా సంవత్సరంలో… పంపిణీ కిట్లను ఇప్పటికే సిద్ధం చేసింది ప్రభుత్వం.
ఇది ఇలా ఉండగా…రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది కొత్త ఏర్పాటు కాబోతున్న చంద్రబాబు సర్కార్. రేపు(బుధవారం) ఏపీలో స్కూళ్లకు విద్యా శాఖ సెలవుదినంగా ప్రకటించింది. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా.. సీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.