ఏపీలో క్యాంటీన్ పునః ప్రారంభం..మొదట బాలయ్య అడ్డాలోనే

-

ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఏపీలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభం అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటిగా హిందూపురం పట్టణంలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభం అయింది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు బాలయ్య.

In Pics Nandamuri Balakrishna relaunches Anna canteen in Hindupur

ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన అన్న క్యాంటీన్ తొలగించి సచివాలయం ఏర్పాటు చేశారు అధికారులు. అన్న క్యాంటీన్ తొలగించడంతో సొంత నిధులతో ఐదు సంవత్సరాలపాటు ఆసుపత్రి ప్రధాన గేటు ముందు భాగంలో మొబ్తెల్ వాహనం ద్వారా పేదలకు అన్నదానం చేశారు. టిడిపి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news