రైతులు ఈ తప్పులు చేస్తే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రావు..!

-

రైతులకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా డబ్బులు అందిస్తోంది. దీని వలన రైతులకి ప్రయోజనకరం. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతాయి.

 పీఎం కిసాన్/ pm kisan

కొన్ని తప్పులని కనుక చేస్తే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాకపోవచ్చు. ఇలా డబ్బులు రాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. మరి వాటి కోసం కూడా ఇప్పుడు తెలుసుకుని ఆ తప్పుల్ని చెయ్యకుండా చూసుకోండి. ఇక ఆ వివరాల లోకి వెళితే..

బ్యాంక్ ఖాతాతో ఆధార్ నెంబర్ కచ్చితంగా లింక్ అయ్యేలా చూసుకోవాలి. లేదు అంటే డబ్బులు పడకపోవచ్చు. అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్‌గా రాయాలి. దానితో పాటుగా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కూడా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

అంతే కాదండి మీ బ్యాంక్ అకౌంట్‌ పాస్‌బుక్‌లో పేరు, ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండాలి. లేదు అంటే డబ్బులు రావు. అదే విధంగా పని చేస్తున్న బ్యాంక్ ఖాతానే ఇవ్వాలి. కనుక రైతులు ఈ చిన్న చిన్న తప్పులు చెయ్యకుండా ఒకటికి రెండు సార్లు ఈ వివరాలని చూసుకుంటే మంచిది. లేదు అంటే ఈ చిన్న చిన్న పొరపాట్ల వలన డబ్బులు రాకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news