కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు అనేక విద్యా సంస్థల కోర్సులు ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎన్‌ఐటీ వరంగల్ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు ఫీజు కూడా చాలా తక్కువ అందిరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ.500 మాత్రమే నిర్ణయించింది. కానీ, కేవలం 50 సీట్లకు మాత్రమే పరిమితంగా ఉన్నాయి. కోర్సును సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ కూడా అందించనుంది. ఇందులో ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన నిపుణులు అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు. జూలై 5 నుంచి ఈ కోర్సు ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 4 లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు ఐదు రోజుల పాటు శిక్షణ అందించనున్నారు.
Introduction to AI and its applications in real world.
Hands on to implementation of supervised and un supervised methods.
Introduction to Deep learning methods and applications
CNN, RNN applications. Back Propagation.
Hands on to implementation of supervised and unsupervised methods.
Course Brochure & Direct Link
రిజిస్టర్ చేసుకునే విధానం
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్‌ను [email protected], [email protected]కు జులై 4లోగా మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అభ్యర్థులు 9700553922, 8332969733 నంబర్లలో సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను పైన ఇచ్చిన లింక్‌లో బ్రోచర్ కూడా అందుబాటులో ఉండనుంది.