ఎన్నికలు జరుగుతున్న వేళ మోడీ కీలక వ్యాఖ్యలు…!

బీహార్ ప్రజలు ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ను తిరిగి ఎన్నుకుంటారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తరువాత నాల్గవసారి ఆయన రాష్ట్రాన్ని సందర్శించారు. మూడు దశల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రెండవ దశకు గానూ 243 అసెంబ్లీ స్థానాల్లో 94 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

“ఎన్డిఎ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవటానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, మనకు లభిస్తున్న ప్రాధమిక సమాచారం ఆధారంగా బీహార్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇక్కడ ఓటర్లు రాష్ట్రాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు” అని మోడీ పేర్కొన్నారు. మోడీ ఎన్నికలలో ఎందుకు గెలుస్తారు’ అని కొందరు అంటారు. “మోడీ ఎన్నికలలో గెలుస్తారు ఎందుకంటే అతను (పేద) తల్లులు మరియు సోదరీమణులందరి సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తాడు. అందుకే వారు మోడిని ఆశీర్వదిస్తారు. ఈ కొడుకు తన జీవితాన్ని పేదల కోసం అంకితం చేసాడు,”అని మోడీ అన్నారు