హైదరాబాద్‌లో నాలాలు మరో మహిళ ప్రాణం తీశాయి. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సరోజ అనే మహిళ నాలా పడి చనిపోయింది. చైతన్యపురి హనుమాన్ నగర్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలు ఎంతకూ రాకపోవడంతో.. వెతకడానికి వెళ్లిన కుటుంబసభ్యులకు హనుమాన్ నగర్ నాలా వద్ద శవమై కనిపించింది. నాలాలో మహిళ కొట్టుకుపోయిందన్న సమాచారం అందుకున్న వెంటనే డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్, పోలీసులు, GHMC సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన DRF టీమ్ ను , పోలీసులను GHMC సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు మునిగిపోవడానికి,ప్రమాదాలకు నాలాల ప్రస్తుత పరిస్థితే కారణం. అందుకే ఈ అంశంపై అధ్యయనం చేసి, నాలాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా… నాలాలపై కబ్జాలను తొలగించి వరద సాఫీగా కిందికి వెళ్లేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఫీడర్ నాలాలను కూడా పరిశీలించి… అవసరమైన వాటిని ఆధునికీకరిస్తారు.భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినా, ముంపు అరికట్టేలా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టబోతన్నారు.