దేశంలోకి ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పొరుగు దేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తోందని ప్రధాని రేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని దమెహ్ సభలో పాల్గొన్న మోదీ పాకిస్థాన్పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో భాగంగా దమోహ్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితి బాగాలేదని,. అనేక దేశాలు దివాలా తీస్తున్నాయని పేర్కొన్నారు. అందులో ఉగ్రవాదులను ఉసిగొల్పే పొరుగుదేశం ఒకటి ఇప్పుడు గోధుమ పిండి కోసం తంటాలుపడుతోందని దాయాది దేశానికి చురకలంటించారు.
“ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో గత 10 ఏళ్లుగా చూస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. కానీ మా ప్రభుత్వం మాత్రం అక్కడ ఉన్న భారత పౌరులను సురక్షితంగా తీసుకువచ్చింది. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ పథకం పొడిగించాం” అని మోదీ తెలిపారు.