ప్రధాని మోడీ మాట నిలబెట్టుకున్నారు : సీఎం ఒమర్ అబ్దుల్లా

-

జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని.. హామీ ఇచ్చినట్టుగానే ప్రధాని విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారని పేర్కొన్నారు. మోడీ మూడోసారి ప్రధానిగా అధికారం చేపట్టిన తరువాత శ్రీనగర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారని పేర్కొన్నారు. అన్నట్టుగానే నాలుగు నెలలలోపు జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరిగి కొత్త ఏడాది ఏర్పాటు అయిందన్నారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని.. ఎక్కడా రిగ్గింగ్.. అధికార దుర్వినియోగం జరిగినట్టు ఫిర్యాదులు లేవన్నారు. అలాగే జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని త్వరలో నెరవేరుస్తున్నారని నమ్ముతున్నానని తెలిపారు. భారతదేశంలోని ఒక రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ గా అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతి భద్రతలు కొలిక్కి వచ్చాయని ఒమర్ అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news