టీమిండియాకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. రోహిత్, విరాట్ తో స్పెషల్ చిట్చాట్

-

వరల్డ్కప్ ట్రోఫీ నెగ్గి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను ముద్దాడిన టీమ్ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఈ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో టీమిండియా గెలుపు జోరు మామూలుగా లేదు. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి మామూలుగా సందడి చేయలేదు.

మరోవైపు ఈ విజయ సంబురానికి ప్రధాని మోదీ కూడా అతీతులు కాలేదు. అందుకే టీమిండియా గెలవగానే ఆయన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఓవైపు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేసుకున్న మోదీ మరోవైపు భారత జట్టుతో మాట్లాడాలని స్వయంగా ఫోన్ కాలా చేశారు. ఆదివారం రోజున ఆయన స్వయంగా ఫోన్ చేసి టీమ్ఇండియా ప్లేయర్లను అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో ఫోన్లో మోదీ స్పెషల్ గా ముచ్చటించారు. హిట్మ్యాన్ కెప్టెన్సీ, టీ20 కెరీర్పై ప్రశంసలు కురిపించిన మోదీ ఫైనల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముఖ్యంగా ఆఖరి ఓవర్ గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఇక టీమ్ఇండియా జట్టుకు కోచ్గా రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version