మాల్దీవుల అధ్యక్షుడికి మోదీ రంజాన్‌ శుభాకాంక్షలు

-

ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు బుధవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముగిశాయి. దీంతో చాంద్‌ ముబారక్‌.. అంటూ ముస్లిం సోదరులు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫితర్‌)ను గురువారం జరుపుకోవాలనే సూచనగా బుధవారం రాత్రి సైరన్‌ మోతలు వినిపించడంతో ఇవాళ దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, నాగరికతపరమైన అనుసంధానం గురించి ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నిర్వహించుకుంటున్న తరుణమిది అని అన్నారు. సోదరభావం, కరుణ, కలిసికట్టుగా ఉండడం వంటివాటి విలువను ప్రపంచ ప్రజలకు మనం గుర్తు చేస్తున్నామని తెలిపారు. మనమంతా తపిస్తున్న శాంతియుత, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడంలో ఇవన్నీ తప్పనిసరి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version