త్వరలో 5 ట్రిలియన్​ ఆర్థిక వ్యవస్థగా ఇండియన్​.. ​బ్రిక్స్ సదస్సులో మోదీ

-

భారతదేశం త్వరలోనే ​ 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇండియా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా జోహన్నెస్​బర్గ్​కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన బ్రిక్స్ బిజినెస్​ ఫోరమ్​ లీడర్స్ మీట్​లో పాల్గొన్నారు.

ఈజ్​ ఆఫ్ డూయింగ్​ బిజినెస్​లోనూ భారత్​ ముందంజలో ఉందని తెలిపారు. 100 యూనికార్న్​లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్​ వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పారు. జీఎస్‌టీ అమలుతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని.. భారత్‌లో వీధి వ్యాపారులు కూడా యూపీఐ వాడుతున్నారని.. భారత్‌ను తయారీ హబ్‌గా రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

అంతకుముందు దక్షిణాప్రికా రాజధాని జోహన్నెస్​బర్గ్​కు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ ఉపాధ్యక్షుడు పాల్ షిపోకోసా మషతిలే ఘన స్వాగతం పలికారు . అనంతరం ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. బ్రిక్స్‌ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news