కాసేపట్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. ఇస్రోకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ

-

చందమామ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇస్రో ఇవాళ జాబిల్లిపైకి చంద్రయాన్​-3ని పంపనున్న విషయం తెలిసిందే. భారత అంతరిక్ష సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి సర్వం సిద్ధంగా ఉంది. అంతా సాఫీగా సాగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో దీనిపై ప్రధాని మోదీతో సహా పలు రంగాల ప్రముఖులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇస్రోకు గుడ్​ లక్ చెబుతూ.. చంద్రయాన్ -3 సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విషెస్ తెలియజేస్తున్నారు.

‘అంతరిక్ష రంగంలో ఈ రోజు( జులై 14,2023) చరిత్రలో నిలిచిపోతుంది. చంద్రుడిపైకి చంద్రయాన్‌-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవ్‌గణ్‌, అనుపమ్‌ ఖేర్ కూడా ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news