మా దేశంలో వాగ్నర్ గ్రూపే లేదు.. క్రేజీ షాక్ ఇచ్చిన పుతిన్

-

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికి గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవలే రష్యాపై వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పుతిన్.. అసలు రష్యాలో అటువంటి గ్రూపే అధికారికంగా లేదని చెప్పడం గమనార్హం. రష్యా పత్రిక ‘కొమ్మర్సంట్‌’ వద్ద పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాలో తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత జూన్‌ 29న క్రెమ్లిన్‌లో జరిగిన కీలక సమావేశంలో వాగ్నర్‌ బాస్‌ ప్రిగోజిన్‌ సహా 35 మంది కమాండర్లు పాల్గొన్నారు.  ఆ సమావేశ వివరాలను వెల్లడిస్తూ ఈ విషయాన్ని పుతిన్‌ చెప్పారు.

ఆ మీటింగ్‌లో మూడు అంశాలను చర్చించామని.. వీటిల్లో మొదటిది.. ఉక్రెయిన్‌ యుద్ధ క్షేత్రంలో వారు ఎలా పోరాడారన్నది. రెండోది.. జూన్‌ 24 ఘటనల్లో వారు ఏం చేశారన్నది. ఇక మూడోది.. భవిష్యత్తులో వారి సేవల గురించింది. దీనిలో వారి యుద్ధ అనుభవాన్ని వాడుకొనే అంశం కూడా ఉందని పుతిన్​ వెల్లడించారు.

వాగ్నర్‌ పీఎంసీ అనేది లేదని.. తమ చట్టాలు ప్రైవేటు సైన్యాలకు అనుమతి ఇవ్వవని చెప్పారు. వాస్తవానికి వాగ్నర్‌ గ్రూపు ఉంది కానీ, చట్టం దృష్టిలో మాత్రం అటువంటి సంస్థ లేదని చెప్పి షాక్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news