జైల్లో ఉన్న వారు ఆ పత్రాలపై సంతకాలు చేయలేరు.. ఆప్ ఆరోపణలపై జైళ్లశాఖ

-

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారు కేవలం రెండు రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని జైళ్ల శాఖ తెలిపింది. అయితే అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూదని పేర్కొంది. తిహాడ్‌ జైల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు సరైన సౌకర్యాలు కల్పించకుండా నేరస్థుడి కంటే దారుణంగా చూస్తున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన జైళ్ల శాఖ ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయని దిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ బనివాల్‌ తెలిపారు.

మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైనా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ .. తిహాడ్ జైలు నుంచే పాలనకు సంబంధించిన ఆదేశాలను ఇస్తున్నారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ వచ్చే వారం నుంచి ఇద్దరేసి మంత్రులతో కారాగారంలోనే సమావేశవనున్నట్లు ఆప్ నేతలు తెలిపారు. ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తారని వెల్లడించారు. కేజ్రీవాల్కు కుటుంబ సభ్యులతో నేరుగా ములాఖత్‌ అయ్యే అవకాశం కల్పించడం లేదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news