ఓమిక్రాన్ వేరియంట్ : 5 గురు ప్రైమ‌రీ కాంటాక్ట్ ల‌కు పాజిటివ్

-

మ‌న దేశం లోని ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బెంగ‌ళూర్ లో ఇద్ద‌రి కి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. అయితే వారి ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంట్రాక్ట్ ల‌లో మొత్తం 5 గురి కి కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి సుధాక‌ర్ తెలిపాడు. ఈ ఐదు గురు ఆరోగ్య వంతం గానే ఉన్నార‌ని తెలిపారు. అలాగే వారు అంద‌రూ కూడా కరోనా నియంత్ర‌ణ టీకాలు వేసుకున్న వారే అని తెలిపారు.

అయితే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వారి లో ఒకరి ట్రావెల్ హిస్ట‌రీ మాత్ర‌మే ఉంద‌ని తెలిపారు. అత‌ను గ‌త నెల 20 న బెంగ‌ళూర్ కి వ‌చ్చి తిరిగి వెళ్లి పోయాడ‌ని తెలిపారు. మ‌రొక వ్య‌క్తి 46 ఏళ్ల డాక్ట‌ర్ అని తెలిపారు. ఆ డాక్ట‌ర్ కు కాంటాక్ట్ లో ఉన్న ఐదు గురికి కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. కాగ రాష్ట్రం లో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెంద కుండా అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అలాగే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ను కూడా పెంచుతున్నామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news