కరోనా, యుద్ధాల ప్రభావం ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్త పడ్డాం: రాష్ట్రపతి

-

కరోనా, యుద్ధాల ప్రభావం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్త పడ్డామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆవాస్‌ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రూ.4 లక్షల కోట్లు వెచ్చించి దేశమంతా తాగునీటి వసతి కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయని చెప్పారు.

కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందించాం. ఆత్మనిర్భర భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలుగా మారాయి. రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం. 2 కోట్లమంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. 4.10 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం. భారత దేశ అభివృద్ధి నాలుగు స్తంబాలపై ఆధారపడి ఉంది. యువ శక్తి, నారీ శక్తి, రైతులు, పేదలు అనే స్తంబాలపై భారత్ ప్రగతి ఆధారపడింది. అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news