తాను వైకాపాకు వెన్నుపోటు పొడిచాననడం హాస్యాస్పదంగా ఉందని, తనను నాకేసి, తనకున్న పదవులను పీకేసి… ఆ పదవులను వేరే వారికి అప్పగించిన వారు చివరకు పార్టీని వదిలిపోయారని, తాను మొదటి నుంచి ప్రజల పక్షం వహించానని, ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని గాంధేయ మార్గంలో ఢిల్లీలో కూర్చుని ప్రశ్నించానని అన్నారు. ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబితే తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు.
అయినా తాను పార్టీకి వెన్నుపోటు పొడిచాననడం పరిశీలిస్తే, ఈ స్క్రిప్టు జూనియర్ సజ్జల రాసి ఇచ్చినట్లుగా ఉందని అన్నారు. అదేదో సాక్షి టీవీలో ప్రసారం చేసుకోక, టీవీ9 లో ప్రసారం చేయించడం ఎందుకు? అని ప్రశ్నించారు. తన శీలాన్ని శంకిస్తే, మీ శిలాలన్నింటినీ బయట పెడతానని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు. వైకాపా నాయకత్వం వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారట అని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అచ్చం నాయుడు గారిని, నందమూరి బాలకృష్ణ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో ఓడించాలనేది జగన్ మోహన్ రెడ్డి పంతమట అని, దాని కోసం నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలను ఖర్చు పెడతారట అని తెలిసిందన్నారు.