‘జల సంచయ్ జన్ భాగీదారి’ ప్రారంభించిన ప్రధాని మోడీ..

-

భారత ప్రధాని నరేంద్రమోడీ జల సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమాన్ని శుక్రవారం గుజరాత్‌లో అధికారికంగా ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. నీటిని నిల్వచేయడం ప్రభుత్వ ప్రధాన విధానమే కాకుండా పుణ్య కార్యమని అన్నారు. ఇందులో ఉదారత, బాధ్యత ఉందని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలు మన విలువను గుర్తించాలంటే జల సంరక్షణే మనందరి మొదటి ధ్యేయం కావాలని స్పష్టంచేశారు.

గుజరాత్‌లో జల్ సంచయ్ జన్ భాగీదారి మిషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించాక ఆయన పై వ్యాఖ్యలు చేశారు. నీటి సంరక్షణ ద్వారా భద్రతను పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో నీటిని పొదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ జల్ సంచయ్ జన్ భాగీదారి మిషన్‌ను ప్రారంభించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version