సీజేఐ నివాసానికి ప్రధాని మోడీ.. నెట్టింట పెద్దఎత్తున విమర్శలు

-

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లారు. చీఫ్ జస్టిస్ ఇంట్లో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. వినాయకుడికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో మంగళ హారతిని ఇచ్చారు. అయితే, రాజకీయాల్లో ఉన్న ప్రధాని మోడీ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడం సమంజసం కాదని నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇది న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లేనని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.‘ప్రైవేట్ మీట్ కోసం సీజేఐ చంద్రచూడ్ తన నివాసానికి మోడీని అనుమతించడం దిగ్బ్రాంతికరం. రాజ్యాంగ పరిధిలో పనిచేసే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అని ట్వీట్ చేశారు. ఇప్పటికే కేంద్రానికి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయని గతంలో కొందరు లాయర్లు సైతం బహిరంగంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రధాని చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news