పని చేయని ప్రభుత్వ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. వేటు వేయాలని ప్రధాని ఆదేశం..!

-

సాధారణంగా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రారు. ఒకవేళ వచ్చినా కానీ పని సరిగ్గా చేయరు. ప్రజలను రోజుల కొద్ది తిప్పించుకుంటారు. మరికొంత మంది అయితే ఏకంగా పనిని పక్కకు పెట్టి ఇతర పనులు చేసుకోవడం.. గేమ్స్ ఆడటం.. ఇలా రకరకాలుగా టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చూస్తేనే ఉన్నాం. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో జరిగే తీరు. అలాగే కొంత మంది లంచాలకు పాల్పడుతుంటారు. లంచం లేనిదే ఏ పనిని ప్రారంభించరు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తీరు పై ప్రధాని నరేంద్ర మోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి పరులు, పని చేయని అధికారులపై వేటు వేయాలని యూనియన్ సెక్రటరీలను పీఎం మోడీ ఆదేశించారు. రూల్స్ ప్రకారం.. వారి పని తీరును మూల్యాంకనం చేయాలని సూచించారు. అంచనాలు అందుకోని వారికి సీసీఎస్ రూల్స్ లోని ఫండమెంటల్ రూల్ 56(జే), రూల్ 48 ప్రకారం.. రిటైర్మెంట్ ఇచ్చేయాలని ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. వీరికి 3 నెలల నోటీసు లేదా వేతనం ఇస్తారు. ఈ రూల్స్ అమలులోకి వచ్చాక ప్రభుత్వం 500 మందిని ఇంటికి పంపేసింది.

Read more RELATED
Recommended to you

Latest news