గగన్ యాన్ ప్రయోగం దిశగా కీలక టెస్టు వెహికల్ అపార్ట్ మిషన్ పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులోకి దూసుకెళ్లిన రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ సహాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. ఇక ఇదే విషయాన్ని వెల్లడిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ ట్వీట్ చేసింది. దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. గగన్ యాన్ సహకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందని పేర్కొన్నారు.
భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్ యాన్ సహకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందని.. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు అంటూ టీవీ డి1 వన్ పరీక్ష విజయవంతం ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అయితే ఉదయం 8 గంటలకి చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. కానీ సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని ఆపేసింది. ఆ తర్వాత ఆ లోపాన్ని గుర్తించి సరిచేసి ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది.