మరికొన్ని గంటల్లో పూరీజగన్నాథ రథయాత్ర ప్రారంభం

-

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది భక్తులను పారవశ్యంలో ముంచేందుకు సిద్ధమవుతోంది ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర. అసంఖ్యాక భక్తులను అలరించే ఈ యాత్రకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల లోపు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపడతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

మరోవైపు కేవలం ఒడిశాలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న జగన్నాథుని ఆలయాల్లో ఈ పవిత్ర యాత్రను నిర్వహించేందుకు ఆ ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల జగన్నాథ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్రయాత్రను నిర్వహించనున్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి. రథయాత్ర మొదలయ్యే సమయానికి భక్తుల రద్దీ మరింత పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news