తిరుమల వెంకన్నకు అపచారం…జగన్ కు శిక్ష తప్పదు – చంద్రబాబు

-

తిరుమల వెంకన్నకు అపచారం…జగన్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు చంద్రబాబు. తిరుమల శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకన్నకు అపచారం తలపెడుతున్నారు… శ్రీవాణి ట్రస్టు నిర్వహించేది ఎవరు..?అని నిలదీశారు. శ్రీవాణి టిక్కెట్లకు రసీదులు ఇవ్వడం లేదని.. రసీదులు ఇవ్వకుండా తీసుకుంటున్న డబ్బులు ఏమవుతున్నాయి..? అని నిప్పులు చెరిగారు.

వెంకన్నకు అపచారం చేస్తే.. పుట్టగతులు ఉండవు… వెంకన్న జోలికి వస్తే వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు లేనే లేవు… తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే ఓ పదో క్లాస్ పిల్లాడి నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి తగులపెట్టారని మండిపడ్డారు. గంజాయి తాగిన వెధవలు ఇలాంటి పని చేశారు… గంజాయి తాగిన వెధవలను సీఎం జగన్ తయారు చేస్తున్నారని తెలిపారు. గంజాయి తాగే వెధవలకు తల్లు చెల్లి తేడా తెలియదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news