అస్సాంలో రాహుల్ గాంధీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బటడ్రావ థాన్ ఆలయంలోకి వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఇష్యూ ఏంటి బ్రదర్? నేను లోపలికి ఎందుకు వెళ్ళకూడదు? నేనేం తప్పు చేశాను? ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని రాహుల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మధ్యాహ్నం 3 తర్వాతే లోపలికి పంపిస్తామని పోలీసులు చెప్పారు. ‘ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే గుడికి వెళ్ళగలరు’ అని రాహుల్ PMని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది. అయితే ఆదివారం రోజున జరిగిన ఈ యాత్ర మార్గంలోకి కొంతమంది బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. అంతటితో ఆగకుండా వారు జై శ్రీరామ్, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. వారికి ప్రతిస్పందించిన రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ అభివాదం చేశారు.