ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టుకు వీడియోను జత చేశారు. ఈ వీడియో చాలా ఎమోషనల్గా ఉంది. ప్రస్తుతం రాహుల్ ఎమోషనల్ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ రాహుల్ గాంధీ చేసిన పోస్టు ఏంటంటే..?
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్దంతి సందర్భంగా రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెట్టింట ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. అందులో 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పార్థివదేహం వద్ద రాహుల్ కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటితో పాటు ఇందిరాగాంధీ ప్రజలతో ఇంటరాక్ట్ అయిన దృశ్యాలు, ఐరాస ప్రసంగానికి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో పోస్టు చేసిన రాహుల్.. ‘‘ నా శక్తి నువ్వే నానమ్మ .. భారత్ కోసం నువ్వు సర్వం త్యాగం చేశావు. ఈ దేశాన్ని నేను ఎప్పటికీ కాపాడుతుంటాను. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటకీ నాతోనే ఉంటాయి’’ క్యాప్షన్ జత చేశారు.
మరోవైపు ‘‘ఆదర్శాలను పాటిస్తూ, ధైర్యంగా జీవిస్తూ.. న్యాయం కోసం పోరాటం చేయాలనేందుకు మీ జీవితం నిదర్శనం’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
मेरी शक्ति, मेरी दादी!
जिस भारत के लिए आपने अपना सर्वस्व बलिदान कर दिया, उसकी हमेशा रक्षा करूंगा। आपकी यादें हमेशा साथ हैं, दिल में। pic.twitter.com/SmpmqM13bo
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2023