రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా బెంగళూరులో నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం విపక్ష నేతలు అంతా సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన ఫేవరెట్ లీడర్ అని చెప్పారు.
బిజెపిపై రాహుల్ గాంధీ బలంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న మమతా బెనర్జీ.. ఎన్డీఏ ని ఓడించేందుకు విపక్ష పార్టీల నేతలమంతా కలిసికట్టుగా పోరాడుతామని వెల్లడించారు. మా కూటమిని బిజెపి ఎదుర్కోగలదా..? అని సవాల్ విసిరారు.